Header Banner

ఫేక్ వార్తను నిజమని నమ్మి అభాసుపాలైన పాక్ ఉప ప్రధాని! AI హెడ్‌లైన్‌తో..!

  Fri May 16, 2025 18:12        Others

ఇటీవల పాకిస్థాన్ పార్లమెంటు (సెనేట్) సమావేశంలో ఇషాక్ దార్ ప్రసంగిస్తూ, బ్రిటన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక 'ది డైలీ టెలిగ్రాఫ్' పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ (పీఏఎఫ్) పనితీరును ఆకాశానికెత్తేసిందని పేర్కొన్నారు. 'గగనతల రారాజు పాక్ ఎయిర్‌ఫోర్స్' (Undisputed King of the Skies) అంటూ ఆ పత్రిక హెడ్‌లైన్ పెట్టిందని ఆయన సభకు తెలిపారు. ముఖ్యంగా, భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు అంతర్జాతీయ మీడియాలో ప్రశంసలు వస్తున్న తరుణంలో, అందుకు భిన్నంగా 'డైలీ టెలిగ్రాఫ్' పాక్ వైమానిక దళాన్ని కీర్తించిందని దార్ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై అనుమానం రావడంతో పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ 'డాన్' న్యూస్ దీనిపై నిజ నిర్ధారణ చేపట్టింది. 'డాన్' పరిశోధనలో ఇషాక్ దార్ చెప్పిన విషయాలు పూర్తిగా అబద్ధాలని తేలింది. మే 10వ తేదీన ప్రచురితమైందని దార్ పేర్కొన్న 'ది డైలీ టెలిగ్రాఫ్' పత్రిక మొదటి పేజీలో అలాంటి వార్త ఏదీ లేదని 'డాన్' స్పష్టం చేసింది.

అసలు ఆ పత్రిక పాకిస్థాన్ సైన్యానికి సంబంధించి ఆ తరహా కథనాన్ని ఎప్పుడూ ప్రచురించలేదని తేల్చి చెప్పింది. మరోవైపు, 'ది డైలీ టెలిగ్రాఫ్' పత్రిక కూడా ఈ విషయంపై స్పందించింది. తాము 'గగనతల రారాజు పాక్ ఎయిర్‌ఫోర్స్' అనే శీర్షికతో ఎలాంటి కథనాన్ని ప్రచురించలేదని ఖరాఖండిగా చెప్పింది. పాకిస్థానీయులే ఎవరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో ఈ తప్పుడు వార్తను, హెడ్‌లైన్‌ను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేయగా, దానిని నిజమని నమ్మి ఇషాక్ దార్ పార్లమెంటులో ప్రస్తావించి అభాసుపాలయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటనతో పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్‌పై సొంత దేశంలోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఇలాంటి నకిలీ వార్తలను పార్లమెంటులో చదవడంపై ఎద్దేవా చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


అర్ధగంటలో అబుదాబీ నుంచి దుబాయ్‌కి ప్రయాణం..! UAE రైలు రంగంలో రికార్డ్!

ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు! మంత్రి కీలక ప్రకటన!

 

 తల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

 

 ఎస్సీ, ఎస్టీ కేసులో సజ్జల భార్గవ్‌కు షాక్‌..! వారిదే తప్పు.. సుప్రీం కోర్టు తేల్చేసింది..!



మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Pakistan #FakeNews #IshaqDar #AIHeadline #ParliamentBlunder #Embarrassment #ViralNews